Asia Cup 2023: చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌!

by Vinod kumar |   ( Updated:2023-08-27 10:19:53.0  )
Asia Cup 2023: చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్‌-2023 మెగా ఈవెంట్‌ ఆరంభానికి ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్‌ అందింది. టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ మాత్రమే కాకుండా వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టాడు. అతడి వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో రాహుల్‌ కూడా ఉన్నాడు.

అయితే అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని జట్టు ప్రకటన సమయంలో భారత ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సృష్టం చేశాడు. ఈ క్రమంలో అతడు కీలకమైన పాకిస్తాన్‌ మ్యాచ్‌కు దూరమవుతాడని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రాహుల్‌ మాత్రం నెట్‌ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గోనడుండంతో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్‌2 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed