- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాకు తిరిగొచ్చిన కేఎల్ రాహుల్.. ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడా?
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో గాయపడిన టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ నాటికి అతను మైదానంలో అడుగుపెట్టేందుకు చూస్తున్నాడు. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం ఇటీవల రాహుల్ వైద్య నిపుణుడిని కలిసేందుకు లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా అతను ఇండియాకు తిరిగొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘లండన్‌లోని టాప్ వైద్య నిపుణులను రాహుల్ సంప్రదించాడు. ఆదివారం అతను భారత్‌కు తిరిగొచ్చాడు. అలాగే, రిహాబిలిటేషన్ కోసం ఎన్‌సీఏలో చేరాడు. ఎన్‌సీఏ నుంచి రిటర్న్ టూ ప్లే సర్టిఫికేట్ పొందాల్సి ఉంది.’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో గాయం కారణంగానే రాహుల్ లీగ్ మధ్యలోనే వైదొలిగాడు. ఈ నెల 22 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. అయితే, టోర్నీకి అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. సంబంధిత వర్గాలు అతను టోర్నీ నాటికి పూర్తిగా కోలుకుంటాడని చెబుతున్నా.. ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. ఆ తర్వాతే అతను లక్నో ప్రీ ఐపీఎల్ క్యాంప్‌లో చేరతాడు.