Kavya Maran-SRH: కావ్యమారన్‌ అదుర్స్.. ఈ లెక్కలే సాక్ష్యం.. నీతా అంబాని కూడా సరిపోదు!

by Vennela |
Kavya Maran-SRH: కావ్యమారన్‌ అదుర్స్.. ఈ లెక్కలే సాక్ష్యం.. నీతా అంబాని కూడా సరిపోదు!
X

దిశ, వెబ్ డెస్క్: Kavya Maran-SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్యమారన్‌ దూసుకుపోతోంది. ఇండియాతో పాటు ఇతర క్రికెట్‌ లీగ్స్‌లోనూ ఆమె తన మార్క్‌ చూపిస్తున్నారు. ఇక మొత్తంగా ఆమె ఆదాయం ఎంతో తెలుసా?

సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు విలువ ఇప్పుడు 400 కోట్లకు పైగా ఉంది. ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు.. ఎవరికీ అర్ధం కాని వ్యూహాలతో, షాకింగ్ డెసిషన్స్‌తో కావ్యమారన్‌ టీమ్‌ను టాప్-క్లాస్ జట్టుగా మార్చేసింది. కేవలం టీం ఓనర్ మాత్రమే కాదు, ఐపీఎల్‌లో కావ్య మారన్ ఒక బ్రాండ్! స్టేడియంలో కెమెరాలు మిగతా వారిని వదిలేసి కావ్యను ఫోకస్ చేయడం వింతేమీ కాదు. ఆమె ఆటగాళ్లను ఎంపిక చేసే తీరు, కోచ్‌లను మార్చే ధోరణి, ఫైర్‌ లాంటి డెసిషన్స్‌తో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటారు కావ్య.

హండ్రెడ్‌ లీగ్‌లో కావ్య ఎంట్రీ

ఇక ఐపీఎల్‌లో కాదు.. ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైన క్రికెట్ లీగ్ "ది హండ్రెడ్" లోకి కూడా కావ్య మారన్ ఎంటరైపోయరని తెలుసా? క్రికెట్ అంటే ఓవర్లు అనే కాన్సెప్ట్ మార్చేసిన లీగ్ ఇది. ప్రతి మ్యాచ్ కేవలం 100 బాల్స్ మాత్రమే! మరింత వేగంగా, మరింత ఎంటర్టైనింగ్‌గా ఉండేలా రూపొందించిన ఈ లీగ్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో, ఇప్పటివరకు భారత పురుష క్రికెటర్లకు ఆడే అవకాశం లేదు. కానీ భారత మహిళా క్రికెటర్లకు మాత్రం అనుమతి ఉంది. అందుకే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన్న లాంటి ఆటగాళ్లు గత సీజన్లలో బరిలోకి దిగారు. ఇప్పుడీ లీగ్‌లో మరొక భారతీయురాలు ఎంటర్‌ అవ్వనుంది. కానీ ఆడడానికి కాదు.. ఆటను శాసించడానికి కావ్య రెడీ అయిపోయారు.

ఎంతవాట ఉందంటే?

సన్ రైజర్స్ తర్వాత, ఇప్పుడు మరో క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన ఘనత కావ్య మారన్‌దే. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ కౌంటీకి చెందిన నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అనే జట్టులో 49శాతం వాటాను కొనుగోలు చేశారు కావ్య. ఇది ఇండియన్ క్రికెట్ బిజినెస్ హిస్టరీలో చాలా పెద్ద డీల్. అంటే, ఇప్పుడు సన్ రైజర్స్‌తో పాటు నార్తర్న్ సూపర్‌చార్జర్స్ కూడా కావ్య మార్క్‌తో ఆడబోతోంది. ఒకప్పుడు చిన్న బిజినెస్ ఓనర్‌గా మొదలైన ఆమె, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్‌లో టీం ఓనర్‌గా మారడం షాకింగ్‌గా అనిపిస్తోంది.

కావ్య అంటే పిచ్చి

ఇక ఈ డీల్ పూర్తయిన తర్వాత, ఒక ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. కావ్య మారన్ ఇంగ్లాండ్ వెళ్లి, ప్రత్యక్షంగా ఈ లీగ్‌ను చూస్తారా అని..! ఐపీఎల్‌లో ఫ్యాన్స్ క్రేజ్, స్టేడియంల్లో కెమెరా అటెన్షన్.. ఇప్పుడు ఇంగ్లండ్‌కు కూడా షిఫ్ట్ అవుతుందా? అక్కడి మీడియా కూడా ఈ సన్ రైజర్స్ బ్యూటీ పై ఫోకస్ పెడుతుందా? ఒకవేళ కావ్య ఇంగ్లాండ్‌కు వెళ్తే, అక్కడి క్రికెట్ వర్గాల్లో కూడా ఆమె పేరు మార్మోగడం ఖాయం. ఐపీఎల్‌లో తన మార్క్‌ను చూపించిన కావ్య ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్‌లోనూ ఒక కొత్త శకం మొదలు పెడుతుందా అంటే ఓన్లీ టైమ్ విల్ టెల్..! కానీ ఒకటి మాత్రం ఖాయం.. కావ్య మారన్ ఎక్కడ ఉన్నా.. అక్కడ క్రికెట్ ప్రపంచం వాలిపోతుంది. ఇక బిజినెస్‌తో పాటు ఐపీఎల్ ద్వారా కావ్య భారీగానే ఆదాయాన్ని సంపాదిస్తోంది. కావ్య మార‌న్ మొత్తం ఆస్తుల విలువ 409 కోట్ల రూపాయలు ఉండవచ్చు!

Advertisement
Next Story

Most Viewed