రోహిత్‌పై కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కెప్టెనే ఆడకపోతే జట్టుకు సమస్యలు తప్పవంటూ వ్యాఖ్యలు

by Harish |
రోహిత్‌పై కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కెప్టెనే ఆడకపోతే జట్టుకు సమస్యలు తప్పవంటూ వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ వర్మపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెప్టెన్ ఆడకపోతే ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించాడు. ‘రోహిత్ బిగ్ ప్లేయర్. అతను పుంజుకుంటాడని ఆశిస్తున్నా. ఇటీవల టీమిండియా కొన్నిసార్లు బాగా ఆడింది. కొన్నిసార్లు కుదురుకున్నట్టు కనిపించలేదు. కెప్టెన్ ఫామ్‌లో లేకపోతే జట్టు సమస్యలు ఎదుర్కుంటుంది.’ అని తెలిపాడు. అలాగే, ఆటగాళ్లను అతిగా పొగొడొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘టీ20 వరల్డ్ కప్ గెలిచి వచ్చాక అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అలాంటి సీన్లు నేనెప్పుడు చూడలేదు. అలాగే, జట్టు సరిగ్గా ఆడకపోతే విమర్శలు తప్పవు. అందుకే, ఆటగాళ్లను ఎక్కువగా ప్రశంసించొద్దు. విమర్శలను వారు భరించలేరు.’ అని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూచ్తుందని తెలిపాడు.




Next Story