- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kane Williamson: క్రైస్ట్‌చర్చ్ టెస్ట్‌లో మరో అద్భుతం.. చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్
దిశ, వెబ్‌డెస్క్: హాగ్లీ ఓవల్ (Hagley Oval) వేదికగా ఇంగ్లాండ్ (England), న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్‌లో కేన్ విలియమ్సన్ (Kane Williamson) చరిత్ర సృష్టించాడు. గాయం నుంచి కొలుకున్న ఈ కివీస్ బ్యాట్స్‌మెన్ మరో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 197 బంతుల్లో పది ఫోర్లతో 93 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, రెండో ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ కమ్రంలోనే అతడు టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకుని చరిత్ర సృష్టించాడు. టెస్టు ఫార్మాట్ (Test Format)లో ఈ ఘనత సాధించిన 19వ బ్యాట్స్‌మెన్‌గా ఆ జాబితాలో కేన్ మామ చేరాడు. అదేవిధంగా టెస్టుల పరంగా చూస్తే వేగంగా 9 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో బ్యాటర్‌గా కుమార్ సంగక్కర్ (Kumar Sangakkara (శ్రీలంక), యునిస్ ఖాన్ (Younis Khan) (పాకిస్థాన్) సరసన చేరాడు. అయితే, మొత్తం 103 టెస్ట్‌లు ఆడిన కేన్ విలిమ్సన్ (Kane Williamson) 9 వేల పరుగులు చేయగా.. ఆ జాబితాలో అతడి కంటే ముందు స్టీవ్ స్మిత్ (Steve Smith) (99 టెస్టులు), బ్రియాన్ లారా (Brian Lara) (101 టెస్టులు) ఉన్నారు.