- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీమ్ ఇండియాకు భారీ షాక్

- చాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా అవుట్
- హర్షిత్ రాణాకు ఛాన్స్
- యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి
- వెల్లడించిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారీ షాక్ తగిలింది. ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ టోర్నీ సందర్భంగా వెన్నుకు గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. ఐదు వారాల విశ్రాంతి తర్వా బుమ్రా కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. దీంతో చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించే విషయంలో సెలెక్టర్లు వేచి చూశారు. అయితే బుమ్రా ఇంకా వెన్ను నొప్పి నుంచి కోలుకోకపోవడంతో అతడిని చాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయలేదని బీసీసీఐ వెల్లడించింది. బుమ్రా స్థానంలో 23 ఏళ్ల హర్షిత్ రాణాకు జట్టులో చోటు కల్పించింది. అలాగే ఇంతకు ముందు ప్రాబబుల్స్‌లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరిని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హర్షిత్ రాణా టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని బుమ్రా స్థానంలో పేసర్‌గా ఎంపిక చేశారు. ఇక మొదట్లో ఎంపిక చేసిన యశస్వి జైస్వాల్ కేవలం ఒకే వన్డే ఆడటంతో అతడిని పక్కన పెట్టి.. టీ20 సిరీస్‌లో విశేషంగా రాణించిన వరుణ్ చక్రవర్తికి చోటు కల్పించారు. కాగా బీసీసీఐ నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్‌లుగా ముగ్గురిని ఎంపిక చేసింది. వీరు ముగ్గురు దుబాయ్‌కు జట్టుతో పాటు వెళ్లరు. కానీ ఎవరైనా అక్కడ గాయపడితే.. వెంటనే దుబాయ్ వెళ్తారని బీసీసీఐ తెలిపింది.
చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్స్ : యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే