- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంత్‌కు గ్రీన్ సిగ్నల్.. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన ఎన్‌సీఏ
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా పంత్‌కు ఎన్‌సీఏ ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఐపీఎల్-2024తో పంత్ క్రికెట్‌లోకి పునరాగమనం చేయబోతున్నాడు.
2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఆటకు దూరమై దాదాపు 15 నెలలు అవుతుంది. గతేడాది ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అతని గైర్హాజరులో ఢిల్లీ జట్టును డేవిడ్ వార్నర్ నడిపించాడు. గాయాల నుంచి కోలుకున్న పంత్ ఫిట్‌నెస్ సాధించేందుకు ఎన్‌సీఏలో కష్టపడ్డాడు. తాజాగా ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇవ్వడంతో అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. త్వరలోనే పంత్ ఢిల్లీ క్యాంప్‌లో చేరనున్నాడు.
ఈ సీజన్‌లో ఢిల్లీని పంతే నడిపిస్తాడని టీమ్ వర్గాలు ఇప్పటికే ధ్రువీకరించాయి. అయితే, మోకాళ్లకు సర్జరీలు అవడంతో ఇన్నింగ్స్ మొత్తం అతను కీపింగ్ బాధ్యతలు మోయడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. కీపింగ్ బాధ్యతలు మరొకరికి అప్పగించి, రిషబ్‌ను కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడించనుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంత్‌ను ఆడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కోనుంది.