- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నెక్ట్స్ ఐవోసీ ప్రెసిడెంట్ ఎవరు?

- పోటీ పడుతున్న ఏడుగురు
- ముందున్న సెబాస్టియన్ కో
- గట్టి పోటీ ఇస్తున్న క్రిస్టీ కోవెంట్రీ, ఆంటోనియో సమరాంచ్ జూనియర్
- మార్చి 18 నుంచి 21 వరకు ఎన్నికలు
దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యంత బలమైన క్రీడా పరిపాలనా సంస్థ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐవోసీ)కి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. గ్రీస్ వేదికగా మార్చి 18 నుంచి 21 వరకు ఐవోసీలోని 109 సభ్య దేశాలు కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకోనున్నాయి. 2013లో ఐవోసీ ప్రెసిడెంట్‌గా థామస్ బాచ్ ఎన్నికయ్యారు. 8 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోవడంతో బాచ్‌కు వారసుడిని ఎన్నుకోనున్నారు. వాస్తవానికి ఐవోసీ ప్రెసిడెంట్ పదవీ కాలం 4 ఏళ్లు మాత్రమే. అయితే సభ్యుల ఆమోదంతో రెండో టర్మ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. థామస్ బాచ్ 8 ఏళ్ల పదవీకాలం ముగియడంతో ఐవోసీ కొత్త ప్రెసిడెంట్ ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
ఐవోసీ ప్రెసిడెంట్ పదవి కోసం ఏడుగురు పోటీ పడుతున్నారు. బ్రిటన్‌కు చెందిన వరల్డ్ అథ్లెటిక్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో, జింబాబ్వేకు చెందిన ఐవోసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు మెంబర్ క్రిస్టీ కోవెంట్రీ, బ్రిటన్-స్వీడన్ జాతీయుడు, ఇంటర్నేషనల్ స్కీ అండ్ స్నోబోర్డ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జోహాన్ ఎలాయాష్, జోర్డాన్‌కు చెందిన ఐవోసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు మెంబర్ ప్రిన్స్ ఫైసల్ అల్ హుస్సేనీ, ఫ్రాన్స్‌కు చెందిన ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్ ప్రెసిడెంట్ డేవిడ్ లాపాటియా, స్పెయిన్‌కు చెందిన, ప్రస్తుత ఐవోసీ వైస్ ప్రెసిడెంట్ జాన్ ఆంటోనియో సమరాంచ్ జూనియర్, జపాన్‌కు చెందిన ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మోరినారీ వతనాబే పోటీ పడుతున్నారు.
క్రిస్టీ కోవెంట్రీకి ప్రస్తుతం ప్రెసిడెంట్ ధామస్ బాచ్ మద్దతుగా ఉన్నారు. అయితే సెబాస్టియన్ కో, సమరాంచ్ జూనియర్ కూడా గట్టి పోటీ పడుతున్నారు. ఆటగాళ్ల వేతనం వంటి విషయాల్లో సెబాస్టియన్ కో సానుకూలంగా ఉన్నారు. ఐవోసీ సభ్యులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కో వాదిస్తున్నారు. ఆయన ప్రతిపాదనలకు జాన్ ఆంటోనియో, ప్రిన్స్ ఫైజల్ కూడా మద్దతు పలుకున్నారు. అయితే ఒలింపిక్స్ నిర్వహించే నగరాల ఎంపిక విషయంలో సభ్యులకు మరింత అధికారం ఉండాలని ఆంటోనియో అంటున్నారు. అదే విధంగా మల్టీ సిటీ ఈవెంట్‌గా నిర్వహించాలని వతనాబే కోరుతున్నారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో ఏఐ వినియోగం, మహిళా క్రీడల్లో జెండర్ పాలసీలు, అమ్మాయిగా పుట్టిన వారికే మహిళల క్రీడల్లో స్థానం కల్పించడం వంటి విషయాలు కీలకంగా మారనున్నాయి.
ఈ సారి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యే వ్యక్తిపై అనేక అంచనాలు ఉన్నాయి. మారుతున్న రాజకీయ, పర్యావరణ సవాళ్లను ఎదుర్కుంటూ ఒలింపిక్స్ భవిష్యత్‌ను నిర్ణయించడం, హోస్టింగ్ మోడల్స్‌లో మార్పును తీసుకొని రావడం, ఆర్థికంగా మరితం లాభదాయకంగా ఒలింపిక్స్‌ను మార్చడం వంటి విషయాలు కీలకంగా మారనున్నాయి.