INDW vs AUSW 1st ODI: హాఫ్ సెంచరీలతో మెరిసిన లిచ్‌ఫీల్డ్, మెక్‌గ్రాత్.. తొలి వ‌న్డేలో భారత్‌పై ఆసీస్ విజయం

by Vinod kumar |
INDW vs AUSW 1st ODI: హాఫ్ సెంచరీలతో మెరిసిన లిచ్‌ఫీల్డ్, మెక్‌గ్రాత్.. తొలి వ‌న్డేలో భారత్‌పై ఆసీస్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖ‌డేలో టీమిండియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆసీస్ విజయం సాధించింది. ముగ్గురు బ్యాట‌ర్లు హాఫ్ సెంచ‌రీల‌తో చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో హ‌ర్మన్‌ప్రీత్ సేనను ఓడించింది. భార‌త్ నిర్దేశించిన 283 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ఫొబె లిచ్‌ఫీల్డ్(78), ఎలిసా పెర్రీ(75), ఆల్‌రౌండ‌ర్ త‌హ్లియా మెక్‌గ్రాత్(68) హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. దాంతో ఆసీస్ భారీ టార్గెట్‌ను 46.3 ఓవ‌ర్లలోనే ఛేదించింది. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక ఛేద‌న కావ‌డం విశేషం. ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన‌ భార‌త్ నిర్ణీత ఓవ‌ర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు బాదింది. టాపార్డర్ విఫ‌ల‌మైన‌ప్పటికీ.. మిడిలార్డర్ బ్యాట‌ర్లు జెమీమా రోడ్రిగ్స్(82), ఆల్‌రౌండ‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్(62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెల‌రేగారు. ఓపెన‌ర్ య‌స్తికా భాటియా(49) కూడా రాణించడంతో భార‌త్.. ఆసీస్‌కు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూ బౌల‌ర్లలో.. అషే గార్డ్‌న‌ర్, వ‌రేహ‌మ్ త‌లా 2 వికెట్లు తీశారు.

Advertisement

Next Story

Most Viewed