- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో Siraj, Shubman Gill..
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, టీమిండియా ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్(జనవరి) అవార్డు ఐసీసీ నామినేట్ చేసింది. వీరిద్దరూ ఈ మధ్య కాలంలో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇద్దరూ గత జనవరి నెలలో అద్భుతంగా రాణించారు. శుభ్‌మల్ గిల్ అద్భతంగా రాణిస్తున్నాడు. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలోనే డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 149 బాల్స్‌లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్‌లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు.
మరోవైపు మహ్మద్ సిరాజ్ క్రమంగా టీమిండియాలో ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. బుమ్రా లేని లోటును అతడు తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు తీయగా.. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు.