టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. సంజూ శాంసన్ స్థానంలో ఆడేది అతడే..

by Vinod kumar |   ( Updated:2023-01-05 14:41:26.0  )
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. సంజూ శాంసన్ స్థానంలో ఆడేది అతడే..
X

దిశ, వెబ్‌డెస్క్: పుణే వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా. గాయంతో జట్టుకు దూరమైన సంజూ శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేస్తున్నాడు. ఫిట్‌నెస్ సాధించిన అర్ష్‌దీప్ సింగ్.. హర్షల్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. తొలి టీ20లో 2 పరుగులతో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ రేసులో నిలవాలనుకుంటోంది.

టీమిండియా తుది జట్టు:

ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక తుది జట్టు:

పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కాసున్ రజిత, దిల్షాన్ మదుషంక


Advertisement

Next Story