- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఓటమి అంచున భారత్.. టీమిండియా పతనాన్ని శాసించిన లియాన్
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతోన్న మూడవ టెస్ట్‌లో టీమిండియా చేతులెత్తేసింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓవర్ టర్న్ పిచ్‌పై పరుగులు చేసేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్నిన్నర్లు లియాన్, మర్ఫీ, కున్ మెన్‌ల ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాటర్లలో పూజారా ఒక్కడే (59) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే చాపచుట్టేసింది.
భారత్ బ్యాటర్లలో పూజారా 59, శ్రేయస్ అయ్యర్ 26, అశ్విన్ 16, కోహ్లీ 13, రోహిత్ 12 పరుగులు చేయగా.. యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ 8 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. కుహ్నెమాన్, మిచెల్ స్టార్క్ చెరో వికెట్ తీసి టీమిండియా పని పట్టారు. ఇక, సెకండ్ ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. రెండవ రోజు ఆట ముగియడంతో 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఆసీస్ రేపు బరిలోకి దిగనుంది. ఇక, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు విజయాలు సాధించిన భారత్ సిరీస్‌లో 2-0 తేడాతో ముందంజలో ఉంది.