Champions Trophy: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

by Gantepaka Srikanth |
Champions Trophy: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)లో భాగంగా దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా(India) ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో రాణించారు. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. 49.4 ఓటర్లలో 228 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదయ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. 114 బంతుల్లో 100 పరుగులతో అదరగొట్టాడు. జాకర్ అలీ 114 బంతుల్లో 68 పరుగులు చేశారు. మొత్తంగా భారత్ ఎదుట 229 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పెట్టారు.

లక్ష్య ఛేదనలో బరిలోకి వచ్చిన భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(41), శుభ్‌మన్ గిల్(101) అద్భుమైన శుభారంగం చేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(41), విరాట్ కోహ్లీ సైతం రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు, హర్షిత్ రాణా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశారు.

Next Story

Most Viewed