విదేశీ లీగ్‌లపై కన్నేసిన మరో భారత ప్లేయర్..

by Vinod kumar |   ( Updated:2023-07-02 12:16:04.0  )
విదేశీ లీగ్‌లపై కన్నేసిన మరో భారత ప్లేయర్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు పృథ్వీ షాను ఎంపిక చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌-2023లో ఘోర వైఫల్యం చెందడం, అదే సమయంలో అతని సమకాలీకులు ఓపెనర్లుగా రాణించడంతో షా టీమిండియాకు ఆడే ఆశలను దాదాపుగా వదులుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఇంగ్లీష్ కౌంటిలో ఆడనునున్నట్టు వార్తలోస్తున్నాయి.

అతనికి తొలిసారి కౌంటీ క్రికెట్‌ ఆడే అవకాశం దొరికింది. నాటింగ్‌హమ్‌షైర్‌.. పృథ్వీ షా తో ఒప్పందం చేసుకున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. గతంలో బిషన్ సింగ్ బేడీ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి భారత దిగ్గజాలు కూడా నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా.. 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క హాఫ్‌ సెంచరీ సాయంతో 106 పరుగులు చేశాడు. టీమిండియా తరపున 6 వన్డేలు, 5 టెస్టులు ఆడాడు. 5 టెస్టు మ్యాచ్‌ల్లో 42.37 సగటుతో 339 పరుగులు చేయగా.. 6 వన్డేల్లో 31.50 సగటుతో 189 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు, దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed