- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND Vs ENG: సెంచరీ కొట్టిన యశస్వీ జైస్వాల్.. పటిష్ట స్థితిలో టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం వేదికగా ఇండియా, ఇంగ్లండ్ జట్ట మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ శతకం బాదాడు. మందుగా టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం యశస్వీ జైస్వాల్‌తో కలిసి క్రీజ్‌లోకి వచ్చిన రోహిత్ నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఈ క్రమంలో 40 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 41 బంతుల్లో 14 పరగులు చేసిన కెప్టెన్ రోహిత్‌ను ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన పేసర్ షోయమ్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్, జైస్వాల్‌తో కలిసి స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధాటిగా ఆడుతున్న గిల్ 46 బంతుల్లో 34 పరుగులు చేసి ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జిమ్మి అండర్‌సన్ చేతికి చిక్కాడు.
ఒకవైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. ఓపెనర్‌గా వచ్చిన యశస్వీ జైస్వాల్ మాత్రం బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ సెంచరీ చేశాడు. మొదటి సెషన్ ముగిసి సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్టైలిష్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యార్ 59 బంతుల్లో 27 పరుగులు చేసి టామీ హార్ల్టీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్లను కోల్పోయి 196 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ 169 బంతుల్లో 117 పరుగులు, రజత్ పటిదార్ చేసి 16 బంతుల్లో 4 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.