జడేజా, రాహుల్‌‌కు పరీక్ష.. మూడో టెస్టుకు ముందు ఆ టెస్టు చేయించుకోవాల్సిందే

by Harish |
జడేజా, రాహుల్‌‌కు పరీక్ష.. మూడో టెస్టుకు ముందు ఆ టెస్టు చేయించుకోవాల్సిందే
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మిగతా మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులోకి వీరికి చోటు దక్కింది. అయితే, వీరిద్దరు మూడో టెస్టు ఆడటంపై అనుమానాలు ఇంకా తొలిగిపోలేదు. ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేస్తేనే వీరు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు ముందు రాహుల్, జడేజా ఫిట్‌నెస్ టెస్టు చేయించుకోనున్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు మూడో టెస్టుకు రాజ్‌కోట్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోమవారం భారత ఆటగాళ్లు రాజ్‌కోట్ చేరుకోనున్నారు. మంగళవారం రాహుల్, జడేజా ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకానున్నారు. ఫిట్‌నెస్ టెస్టు రిజల్ట్‌ను బట్టి టీమ్‌ మేనేజ్‌మెంట్ మూడో టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed