- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అండర్సన్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్‌లో కీలక మైలురాయిని సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 600 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో మూడు వికెట్లు తీయడంతో ఈ ఫీట్ నెలకొల్పాడు. రూట్, జాకబ్ బెథెల్, ఆదిల్ రషీద్‌లు జడేజా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరారు. 600 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్ జడేజా. అలాగే, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. అతనికంటే ముందు కుంబ్లే(953), అశ్విన్(765), హర్భజన్ సింగ్(707), కపిల్ దేవ్(687) ఉన్నారు. జడేజా 80 టెస్టుల్లో 323 వికెట్లు తీయగా.. 198 వన్డేల్లో 223 వికెట్లు, 74 టీ20ల్లో54 వికెట్లు పడగొట్టాడు. జడేజా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ అండర్సన్(40 వికెట్లు) పేరిట ఉన్న ఈ రికార్డును తాజాగా జడేజా(42 వికెట్లు) బద్దలుకొట్టాడు. అండర్స్ 31 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు తీస్తే.. జడేజా 27 వన్డేల్లోనే 42 వికెట్లు పడగొట్టడం విశేషం.