- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND VS AUS : జైశ్వాల్ వరల్డ్ రికార్డు.. మెక్‌కల్లమ్ రికార్డు బద్దలు
దిశ, స్పోర్ట్స్ : భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పెర్త్ టెస్టులో రెండో రోజు అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. సెంచరీ దిశగా వెళ్తున్న అతను 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే జైశ్వాల్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కొట్టిన రెండు సిక్సర్లతో జైశ్వాల్ ఈ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 34 సిక్సర్లు కొట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు.
ఇంతకుముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరిట ఉండేది. అతడు 2014లో 33 సిక్స్‌లు బాదాడు. తాజాగా మెక్‌కల్లమ్‌ను జైశ్వాల్ అధిగమించాడు. అలాగే, ఈ భారత యువ ఓపెనర్ మరో రికార్డుపై కన్నేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో 12వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న అతను 1,170 రన్స్ చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్(1,338 రన్స్) అతని కంటే ముందున్నాడు. రూట్ కంటే జైశ్వాల్ కేవలం 168 రన్స్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌ను అతను అధిగమించి ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.