- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో భారత్
దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్(1st Test) జరుగుతుంది. మొదటి ఇన్నింగ్స్ లో రెండు జట్లు అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యాయి. మొదటి ఇన్నింగ్స్(First innings) లో భారత్(India) 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా(Austrelia) జట్టును కేవలం 104 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్(Second innings) ప్రారంభించింది. రెండో రోజు భారత మొత్తం 57 ఓవర్లు ఆడగా.. ఓపెనర్లు జైస్వాల్.. కేఎల్ రాహుల్ నిలకడగా రాణించారు. దీంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 172/0 పరుగులు చేసింది.
ఇందులో యువ ప్లేయర్ జైస్వాల్(Jaiswal) 90*, కేఎల్ రాహుల్(KL Rahul) 62* పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొత్తం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో భారత్ భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది. కాగా ఆస్ట్రేలియా గడ్డపై మొదటి వికెట్‌కు భారత్ సాధించిన అత్యధిక భాగస్వామ్యంగా చరిత్రలో నిలిచింది. ఇదిలా ఉంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు సిరీస్ లో భారత్ కనీసం నాలుగు మ్యాచుల్లో గెలవాల్సి ఉంది. ఆ దిశగా భారత కోచ్ గంభీర్(Gambhir) జట్టును ముందుకు తీసుకు పోతున్నట్లు తెలుస్తుంది.