- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముంబై రంజీ జట్టులోకి సూర్యకుమార్, శివమ్ దూబే

- క్వార్టర్స్‌లో హర్యానాతో ఢీ
- ఫిబ్రవరి 8న రోహ్‌తక్‌లో మ్యాచ్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ శివమ్ దూబేలను ముంబై రంజీ జట్టు ప్రాబబుల్స్‌లో ఎంపిక చేశారు. క్వార్టర్ ఫైనల్స్ చేరిన ముంబై జట్టు ఈ నెల 8న హర్యానాతో మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ కోసం ప్రకటించిన 18 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్‌లో సూర్య కుమార్, శివమ్ దూబేకు చోటు దక్కింది. ఈ సీజన్‌లో వీరిద్దరు చెరో రంజీ మ్యాచ్ ఆడారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లు వీరిద్దరూ ఆడారు. భారత జట్టు సూర్యకుమార్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌పై 4-1 తేడాతో విజయం సాధించింది. అయితే భారత టెస్టు, వన్డే జట్లలో చోటు దక్కించుకోలేకపోతున్న సూర్యకుమార్.. రంజీ ట్రోఫీలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. మేఘాలయతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 456 పరుగుల తేడాతో విజయం సాధించి ముంబై జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. గత అక్టోబర్‌లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై తరపున ఆడాడు. ఇక జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబేకు చోటు దక్కింది. రంజీ ట్రోఫీని 42 సార్లు గెలిచిన ముంబై జట్టు ఈ నెల 8న రోహ్‌తక్‌లోని చౌదరి బన్సీలాల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హర్యానాతో తలపడనుంది. ఇక నాలుగు లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ హర్ష్ తన్నాను కూడా ముంబై టీమ్‌లో చేర్చుకున్నారు.