- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
2019 ప్రపంచకప్‌కు రాయుడుని తప్పించింది అతనే : ఉతప్ప సంచలన వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : వన్డే వరల్డ్ కప్-2019కు అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రస్తావిస్తూ.. అప్పటి కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆ ప్రపంచకప్‌కు రాయుడు సెలెక్ట్ కాకపోవడానికి కోహ్లీనే కారణమని వ్యాఖ్యానించాడు. ఇటీవలే కోహ్లీ వల్లే యువరాజ్ సింగ్ కెరీర్ త్వరగా ముగిసిపోయిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉతప్ప మరోసారి కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా కోహ్లీకి నచ్చకపోతే అతన్ని పక్కనపెడతాడని చెప్పాడు. అందుకు అంబటి రాయుడే ఉదాహరణ అని తెలిపాడు. ‘ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యతలు ఉంటాయని నేను ఒప్పుకుంటా. కానీ, ఓ ఆటగాడికి తలుపులు మూసివేయకూడదు. రాయుడుకు వరల్డ్ కప్ జెర్సీలు, వరల్డ్ కప్ కిట్ బ్యాగ్.. అన్నీ అతని ఇంటికి చేరుకున్నాయి. అప్పుడు ఏ ప్లేయర్ అయినా వరల్డ్ కప్ ఆడతాడనే అనుకుంటాడు. కానీ, నువ్వు అతన్ని పక్కనపెట్టావు. అది న్యాయం కాదు.’ అని విరాట్‌పై ఆరోపణలు చేశాడు. కాగా, 2019 వరల్డ్ కప్‌కు రాయుడు బదులు విజయ్ శంకర్‌ను తీసుకోగా అతన్ని దారుణంగా విఫలమయ్యాడు. ప్రపంచకప్ జట్టు ఎంపికపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జట్టు ఎంపికలో సెలెక్టర్లతోపాటు కెప్టెన్ కోహ్లీ కూడా భాగమయ్యాడని చెప్పాడు.