రిటైర్మెంట్‌పై ధోనీ కీలక వ్యాఖ్యలు.. వయసుతో సంబంధమేంటి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Harish |
రిటైర్మెంట్‌పై ధోనీ కీలక వ్యాఖ్యలు.. వయసుతో సంబంధమేంటి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్, చెన్నయ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి వచ్చే ఐపీఎల్ సీజనే చివరిదంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతి సీజన్‌కు ముందు ధోనీ రిటైర్మెంట్ ప్రచారం కామన్ అయిపోయింది. అయితే, రిటైర్మెంట్ ప్రశ్నను ధోనీ ఎప్పుడూ దాటవేస్తూనే వచ్చాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అతను కీలక వ్యాఖ్యలు చేశాడు. వయసును ఎవరూ పట్టించుకోరని, క్రికెట్‌లో మనం ఏ స్థాయిలో పోటీపడుతున్నామన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించాడు.

‘ఏడాదిలో నేను రెండు నెలలు మాత్రమే ఐపీఎల్ ఆడతాను. కానీ, ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. అదే నన్ను కొనసాగించేలా చేస్తుంది. ఐపీఎల్ కష్టతరమైన టోర్నీల్లో ఒకటి. అందుకే నేను 6-8 నెలలు కష్టపడతాను. ఏ లెవల్‌లో ఆడుతున్నమన్నదే ముఖ్యం. వయసును ఎవరూ పట్టించుకోరు.’ అని ధోనీ తెలిపాడు. ‘ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నాలో స్ఫూర్తి నింపేది. భారత్ గెలుపులో నా సహకారం అందించడమే నాకు ప్రేరణ. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యాను. ఇప్పుడు కూడా అదే చెప్పలేను. ప్రస్తుతం క్రికెట్‌పై ప్రేమనే నా ప్రేరణ. మైదానం వెలుపల నేను మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు.


Next Story