- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గంటల వ్యవధిలోనే వినేశ్ ఫొగట్ 2 కేజీల బరువు ఎలా పెరిగింది.. కారణం ఇదే! ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్

దిశ, ఫీచర్స్: వంద గ్రాముల బరువు అధికం కారణంగా వినేశ్ ఫొగట్ ఒలింపిక్స్ ఫైనల్స్ ఆడలేకపోయింది. దీంతో భారత క్రీడాకారులు సోషల్ మీడియాలో బాధ వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ చేరే క్రమంలోనే డిఫెండింగ్ చాంపియన్ ససాకిని ఓడించడంతో ఇక వినేశ్ కు తిరుగేలేదనుకున్నారు. కానీ చివరకు పారిస్ ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఫైనల్‌లో చేరి రజత పతకం దక్కించుకుంటుందనే వినేశ్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే మంగళవారం బరువు ఎంతుందని పరీక్షించగా వినేశ్ 50 కిలోల కంటే తక్కువగానే ఉంది. మరుసటి రోజు తను ఉండాల్సిన వెయిట్ కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉంది.
గంటల వ్యవధిలోనే రెండు కేజీల బరువు ఎలా పెరిగిందో అంతుచిక్కడం లేదంటూ ఇండియన్ క్రాడాకారులు ఆలోచన చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆమె బరువు పెరిగే అవకాశం అస్సలు లేదు. ఒకవేళ బరువు పెరిగిందంటే వినేశ్ తీసుకున్న ఆహారం కారణంగానే అయి ఉంటుందంటున్నారు. ఈ సమయంలో వినేశ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తన కోచ్ పర్యవేక్షించాల్సిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కోచ్ పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం మరోవైపు వాటర్ ఎక్కువగా తీసుకోవడం కారణంగానే బరువు పెరిగిందని వైద్య నివేదికలు తెలియజేస్తున్నాయి.