- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీ20లకు బుమ్రా రిటైర్మెంట్?.. క్లారిటీ ఇచ్చిన భారత స్టార్ పేసర్

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు స్టార్ క్రికెటర్లు టీ20లకు గుడ్ బై చెప్పి అభిమానులకు షాకివ్వగా.. సీనియర్లలో ఇంకెవరైనా వీడ్కోలు పలుకుతారేమోనని చర్చ జరుగుతుంది. తాజాగా టీ20 రిటైర్మెంట్‌పై స్టార్ పేసర్ బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రిటైర్మెంట్ తనకు చాలా దూరంలో ఉందన్నాడు.
గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన టీమ్ ఇండియా సన్మాన కార్యక్రమంలో బుమ్రా మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్ నాకు చాలా దూరంలో ఉంది. నేను ఇప్పుడే మొదలుపెట్టాను. నేను రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం రిటైర్మెంట్ నాకు దూరంలో ఉంది.’ అని వ్యాఖ్యానించాడు. బుమ్రా క్లారిటీ ఇవ్వడంతో అతని రిటైర్మెంట్ వార్తలకు ఫుల్‌స్టాఫ్ పడింది. కాగా, టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. బంతితో సత్తాచాటిన అతను 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అతన్నే వరించింది.