- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Glenn Maxwell : T20ల్లో 10 వేల పరుగుల క్లబ్‌లో చేరిన గ్లెన్ మ్యాక్స్ వెల్
by Sathputhe Rajesh |

X
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో గ్లెన్ మ్యాక్స్ వెల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లో 43 పరుగులు చేసిన ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ పొట్టి ఫార్మాట్‌లో 10వేల పరుగులు చేసిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్-12,411, ఆరోన్ ఫించ్- 11,458 పరుగులతో ఆ ఫీట్ అధిగమించారు. టీ20ల్లో 448 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ మొత్తం 7 సెంచరీలు, 54 అర్థ సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో 10వేల పరుగులు చేసిన 16వ అంతర్జాతీయ ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. ఈ లిస్టులో వెస్టిండీస్ విధ్వంసర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ 463 మ్యాచ్‌ల్లో 14,562 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.
Next Story