నిరాశకు గురయ్యా- రన్ ఔట్ పై స్పందించిన రోహిత్ శర్మ

by Shamantha N |   ( Updated:2024-01-12 04:34:19.0  )
నిరాశకు గురయ్యా- రన్ ఔట్ పై స్పందించిన రోహిత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్: రన్ ఔట్ అవ్వడంతో నిరాశకు గురయ్యా అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్ లో భాగంగా కొన్నిసార్లు రన్ ఔట్ అవుతామని.. అప్పుడు ఫ్రస్టేటెడ్ గా అన్పిస్తుందన్నాడు. గిల్- రోహిత్ క్రీజులో ఉన్నప్పుడు రోహిత్ ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఆ టైంలో మైదానంలో రోహిత్ తన కోపాన్ని ప్రదర్శించాడు. మ్యాచ్ తర్వాత రనౌట్ పై అతడు ఈ విధంగా స్పందించాడు. టీమ్ కోసం మంచి స్కోర్ చేయాలనుకున్నట్లు తెలిపాడు. గిల్ భారీ స్కోర్ చేస్తాడని ఆశించానని.. కానీ మంచి చిన్న ఇన్నింగ్స్ కే ఔట్ అయ్యాడన్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన శివమ్ దుబె ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ-20 మ్యాచ్ లో బరిలోకి దిగాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

టీ-20 ప్రపంచ కప్ దృష్ట్యా కావాలనే మేనేజ్ మెంట్.. అసౌకర్య పరిస్థితుల్లోనూ గేమ్ గెలిచేలా ప్లేయర్లకు సవాల్ విసురుతుందన్నాడు. అందుకే 19 వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేశాడన్నాడు. దుబే, జితేష్ బ్యాటింగ్ విధానం, రింకూ, తిలక్ ఫాంలో ఉండటం కలిసొచ్చిందన్నాడు. చాలా కాలం తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో తనపై కొంత ఒత్తిడి పడిందన్నాడు. తొలి 2-3 బంతుల్లో ఒత్తిడి గురవుతానని.. తర్వాత బాల్ పై దృష్టి పెడ్తానన్నాడు. టీ-20ల్లో భారీగా సిక్స్ లు కొట్టే సామర్థ్యం తనకుందని.. ఎప్పుడైనా పరుగులు తీయగలనన్నాడు.

టీ-20 ప్రపంచకప్ కు ముందు భారత్- అఫ్గాన్ మధ్య 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ కు ముందు భారత్ కు ఇదే చివరి టీ-20 సిరీస్. మరోవైపు తొలి టీ-20 మ్యాచ్ లో అఫ్గాన్ పై 159 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా.

Advertisement

Next Story

Most Viewed