Australia Cricket Teams : అసీస్ క్రికెట్ జట్ల డబుల్ ధమాకా

by Y. Venkata Narasimha Reddy |
Australia Cricket Teams : అసీస్ క్రికెట్ జట్ల డబుల్ ధమాకా
X

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అస్ట్రేలియా మహిళల, పురుషుల(Australia Women's And Men's Teams) జట్లు ఒకేరోజు ఇన్నింగ్స్ తేడాతో ప్రత్యర్థి జట్లపై రికార్డు విజయాలు నమోదు చేశాయి. మహిళల యషెస్ సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ లో ఇంగ్లాండ్ తో జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్ లో (ENG Women vs AUS Women) ఇంగ్లాండ్ పై అసీస్ మహిళల జట్టు ఇన్నింగ్స్ 122పరుగులతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 71.4ఓవర్లలో 170పరుగులకు అలౌట్ అయ్యింది.

ఆ జట్టులో బ్రంట్ ఒక్కరే 51పరుగులు చేశారు. అసీస్ బౌలర్ అల్నా కింగ్ 4వికెట్లు సాధించింది. అనంతరం అసీస్ మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 130.3ఓవర్లలో 440పరుగుల భారీ స్కోరు సాధించి అలౌల్ అయ్యింది. అసీస్ బ్యాటర్లు అన్నాబెల్ సదర్ ల్యాండ్ 163, బెత్ మూనీ 106పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్సల్ స్టోన్ 5 వికెట్లతో రాణించింది. 270పరుగుల భారీ లోటుతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 68.4ఓవర్లలో 148పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ 122పరుగులతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో అల్నా కింగ్ రెండో ఇన్నింగ్స్ లోనూ 5వికెట్లు తీసి మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు పడగొట్టింది. గాడ్నేర్ 4 వికెట్లు తీసింది.

అటు శ్రీలంక పర్యటనలో ఉన్న అసీస్ పురుషుల జట్టు గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో (Sri Lanka vs Australia) తొలి ఇన్నింగ్స్ లో 654/6 భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 232, కెప్టన్ స్టీవ్ స్మిత్ 141, ఇంగ్లీస్ 102పరుగులు సాధించారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 165పరుగులకే అలౌటైంది. అసీస్ బౌలర్లతు మాధ్యూ కన్నెమాన్ 5 వికెట్లు, లయన్ 3,స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. 489పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 247పరుగులకు అలౌటైంది. దీంతో అసీస్ 242పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అసీస్ బౌలర్లలో కనెమాన్ 4వికెట్లు, లయన్ 4, స్టార్క్, మర్ఫీ తలో వికెట్ సాధించారు.


Next Story