Divorce: సార్ ఆమెను వదిలి వేయండి.. నటాషాను దారుణంగా ట్రోల్ చేస్తున్న హార్ధిక్ అభిమానులు!

by Jakkula Samataha |   ( Updated:2024-07-19 16:09:40.0  )
Divorce: సార్ ఆమెను వదిలి వేయండి.. నటాషాను దారుణంగా ట్రోల్ చేస్తున్న హార్ధిక్ అభిమానులు!
X

దిశ, సినిమా : గత కొన్ని రోజుల నుంచి వస్తున్న రూమర్స్‌కు తెర పడింది. హార్ధిక్ పాండ్యా, నటాషా విడిపోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ, హార్ధిక్ , నటషా విడాకులు తీసుకున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, గురువారం, తాము విడిపోతున్నామని, ఇక ఇద్దరం కలిసి ఉండలేము అని నిర్ణయించకున్న తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నాము, ఇది మా ఇద్దరికీ కష్టమైనదే కానీ తప్పలేదు, మేము మా కుమారుడు అగస్త్యకు ఇద్దరం కో పేరెంట్‌గా కొనసాగుతాము, మీరు మా ప్రైవసీకి భంగం కలిగించకుండా మమ్మల్ని అర్థంచేసుకుంటారని కోరతున్నాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రకటన తర్వా హార్ధక్ అభిమానులు నటాషాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె పోస్టులో కామెంట్స్ ఆఫ్ చేసినప్పటికీ, ఎక్స్ ఖాతా‌లో ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు. అందులో ఓ నెటిజన్ ‘ఇట్నే అచ్చే ఇన్సాన్ కో పెహచాన న్హీ పాయా’( అతను ఎంత మంచివాడో ఆమెకు అర్థంకాలేదు) అని కామెంట్ చేయగా, మరొకరు హార్ధిక్ చాలా మంచి వాడు అని కామెంట్ చేశారు. ఇంకొందరు ఆమెను వదలి వేయండి సార్, ఆమె కంటే మీరు చాలా మంచి వారు అని కామెంట్ చేశారు. ప్రస్తుతం వారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ , డ్యాన్సర్ నటాషా స్టాంకోవిచ్ ‌ను హార్థిక పాండ్యా 31, మే 2020న హిందూ, క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు కూడా జన్మించాడు.

Advertisement

Next Story