- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Champions Trophy 2025: టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా ఇవాళ అత్యంత రసవత్తమైన మ్యాచ్ జరుగబోతోంది. దుబాయ్ అంతర్జాతీయ మైదానం(Dubai International Ground) వేదికగా మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్(High voltage Match)లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్(Pakistan).. బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా(India) కంటే పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్తాన్ ఇక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ మాత్రం న్యూజిలాండ్‌తో ఓటమి కారణంగా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, కమ్రాన్ గులాం, తయ్యబ్ తాహిర్, ఖుఫ్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు.