Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌‌పై సౌతాఫ్రికా ఘనవిజయం

by Gantepaka Srikanth |
Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌‌పై సౌతాఫ్రికా ఘనవిజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) ఘన విజయం సాధించింది. పాకిస్తాన్‌(Pakistan)లోని కరాచీ(Karachi) మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా (South Africa) అద్భుతంగా రాణించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా అదరగొట్టారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(103) సెంచరీతో పాటు కెప్టెన్ బవుమా(58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(52), ఐడెన్ మార్క్రామ్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది. 316 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌లో ఓపెనర్లు గుర్బాజ్(10), ఇబ్రహీం(17), అటల్(16), షాహిదీ(0), ఒమర్‌జాయ్(18), నబీ(8) పరుగులకే పెవీలియర్ చేరారు. రహ్మత్ షా(90) చివరి వరకు పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.

Next Story