- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డబ్ల్యూఎఫ్ఐపై నిర్ణయం తీసుకోండి

- క్రీడాకారుల ప్రయోజనాలు కాపాడండి
- ఢిల్లీ హైకోర్టు
దిశ, స్పోర్ట్స్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కు సరైన పాలక వర్గం లేకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 25 నుంచి జోర్డాన్ వేదికగా ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు భారత జట్టును ఎంపిక చేయడానికి డబ్ల్యూఎఫ్ఐలో కమిటీ లేదు. దీనిపై హైకోర్టు స్పందించింది. డబ్ల్యూఎఫ్ఐ బాధ్యుడు సంజయ్ సింగ్‌ను కేంద్ర క్రీడా శాఖ సస్పెండ్ చేయడంతో అడ్-హక్ కమిటీని ఏర్పాటు చేయడంలో ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ విఫలమయ్యింది. దీని వల్ల అథ్లెట్లు ఇబ్బందులు పడుతున్నారని, వారి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ గెడెల ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంజయ్ సింగ్ నేతృత్వంలోని డబ్ల్యూటీఐని కేంద్ర క్రీడా శాఖ సస్పెండ్ చేయడం, అడ్-హక్ కమిటీని కూడా పునరుద్దరించకపోవడంతో అంతర్జాతీయ ఈవెంట్లకు భారత జట్టును పంపలేక పోతున్నారు. ఇవి క్రీడాకారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని, పరిస్థితి నిరాశాజనకంగా ఉందని కోర్టు చెప్పింది. అయితే సోమవారం లోగా డబ్ల్యూఎఫ్ఐ భవిష్యత్ ఏంటో కోర్టుకు తెలియజేయజేస్తామని కేంద్ర క్రీడాశాఖ హైకోర్టుకు తెలిపింది. దీంతో మార్చి 11న తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. కాగా, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్ తరపున రెజ్లింగ్ క్రీడాకారులు పాల్గొనాలంటే యూడబ్ల్యడబ్ల్యూ గుర్తింపు పొందిన క్రీడా సంస్థల ద్వారా మాత్రమే ఎంపిక చేయబడాల్సి ఉంది. అలా గుర్తింపు ఉన్న డబ్ల్యూఎఫ్ఐ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉండటంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.