- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: భారత మహిళా జట్టు అరుదైన ఘనత.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌లో తొలిరోజే రికార్డుల మోత
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మందాన సౌతాఫికా బౌలర్లకు చుక్కలు చూపించారు. టీ20 తరహాలో వరుసగా సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఒపెనర్ షెఫాలీ వర్మ 197 బంతుల్లో 205 పరుగులు చేసి కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసింది.
ఇక మరో మరో ఓపెనర్ స్మృతి మందాన 161 బంతుల్లో 149 పరుగు చేసింది. అనంతరం వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు కూడా రాణించడంతో మొదటి రోజు భారత్ మహిళల జట్టు 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పలు రికార్డులు నమోదు చేసింది. టెస్టుల్లో ఒకే రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా జట్టుగా అవతరించింది. దీంతో ఇంగ్లాండ్ మహిళా జట్టు చేసిన 509 పరుగుల రికార్డును చెరిపివేస్తూ భారత జట్టు 525 పరుగులు చేసి సరికొత్త రికార్టును లిఖించింది.