కోహ్లీ, రోహిత్ లేకుండ మొదటి సారి ఆస్ట్రేలియా పై భారీ స్కోర్

by Mahesh |   ( Updated:2023-09-24 13:47:50.0  )
కోహ్లీ, రోహిత్ లేకుండ మొదటి సారి ఆస్ట్రేలియా పై భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచులో భారత్ 399 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ సాధించిన అత్యధిక స్కోరుగా ఇది నిలిచిపోయింది. అలాగే భారత స్టార్ బ్యాటర్లైన కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ ఇంత మొత్తంలో భారీ స్కోర్ చేయడం ఇదే మొదటిసారి అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియా జట్టుపై 2018లో ఇంగ్లాండ్ జట్టు 481 పరుగుల భారీ స్కోరు చేసింది. అలాగే సౌత్ ఆఫ్రికా 438, 416, ఆ తర్వాత నేడు భారత్ 399 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది.

Advertisement

Next Story