బీసీసీఐ కీలక నిర్ణయం.. టెస్టు కెప్టెన్‌గా రోహిత్..!

by Disha Newspaper Desk |
బీసీసీఐ కీలక నిర్ణయం.. టెస్టు కెప్టెన్‌గా రోహిత్..!
X

న్యూఢిల్లీ : భారత్ టెస్ట్ కెప్టెన్ నియామకంపై జరుగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు బీసీసీఐ చెక్ పెట్టింది. టెస్టు సారధి బాధ్యతలు కూడా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి మొదటి వారంలో వెస్టిండీస్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఆ సమయంలో టెస్టు కెప్టె‌న్ గా రోహిత్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. రోహిత్ శర్మ గాయం కారణంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో తదుపరి కెప్టెన్ ఎవరనే విషయం పై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు బీసీసీఐ ఇప్పటికే రోహిత్ శర్మతో మాట్లాడి త్వరలోనే అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం వన్డే, టీ20 ఫార్మాట్‌కు రోహిత్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌ భారత పర్యటన అనంతరం దేశీయంగా శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. అంతేకాకుండా టెస్ట్ వైస్ కెప్టెన్ కోసం కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ ఇద్దరిలో ఒకరి ఎంపికపై సెలెక్టర్లు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed