రెండో వన్డేలో శ్రీలంక గెలుపు.. బంగ్లాతో వన్డే సిరీస్ 1-1తో సమం

by Harish |
రెండో వన్డేలో శ్రీలంక గెలుపు.. బంగ్లాతో వన్డే సిరీస్ 1-1తో సమం
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక జట్టు పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. శుక్రవారం చటో‌గ్రామ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాపై 3 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 286 పరుగుల చేసింది. తౌహిద్ హృదయ్(96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. సౌమ్య సర్కార్(68) రాణించాడు. లంక బౌలర్లలో వానిందు హసరంగ(4/45) సత్తాచాటాడు. 287 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 47.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక(114) సెంచరీతో కదం తొక్కగా అతనికితోడు చరిత్ అసలంక(91) రాణించాడు. ఆఖర్లో హసరంగ(25) మెరిపించగా.. దునిత్ వెల్లలాగే(15 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. సోమవారం నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed