- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్.. సింధు, శ్రీకాంత్, ప్రణయ్ శుభారంభం..
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో స్టార్ షట్లర్లు పీవీ సింధు (P.V.Sindhu) , కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) , హెచ్ఎస్ ప్రణయ్ (Prannoy H. S.) శుభారంభం చేశారు. బుధవారం నాడిక్కడ జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన మిథున్ మంజునాథ్ సింగపూర్‌కు చెందిన నాలుగో సీడ్, ప్రపంచ 7వ ర్యాంక్ ఆటగాడు కీన్ యూ లోహ్‌ను కంగుతినిపించాడు. 41 నిమిషాల పాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 50వ ర్యాంక్ ఆటగాడు మంజునాథ్ 21-19, 21-19 స్కోరుతో వరుస సెట్లలో ఓడించాడు. అయితే.. భారత్‌కే చెందిన కిరణ్ జార్జ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడటంతో లక్ష్యసేన్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. మలేషియాకు చెందిన మహ్మద్ హఫీజ్ షమీమ్ అనే కొత్త కోచ్ శిక్షణలో రాటుదేలుతున్న సింధు మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 21-18, 21-13 స్కోరుతో స్వదేశానికే చెందిన అష్మితా చలిహాను చిత్తు చేసింది.
ప్రపంచ 19వ ర్యాంక్ ఆటగాడు శ్రీకాంత్ 21-18, 21-7 స్కోరుతో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోను మట్టి కరిపించాడు. ఆరో సీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ 21-18, 16-21, 21-15 స్కోరుతో హాంకాంగ్‌కు చెందిన చెయుక్ యుయు లీపై అతి కష్టం మీద గెలిచాడు. రైజింగ్ షట్లర్ ప్రియాంషు రజావత్ కూడా ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ టాంగ్‌పై 21-12 21-16 తేడాతో విజయం సాధించాడు. ఇతర భారతీయుల్లో ఆకర్షి కశ్యప్ 21-15 21-17తో మలేషియాకు చెందిన జిన్ వీ గోహ్‌ను ఓడించింది. అయితే.. మాళవికా బన్సోడ్ చైనీస్ తైపీకి చెందిన యు పో పాయ్ చేతిలో 20-22 11-21 తేడాతో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.
రోహన్ కపూర్, సిక్కిరెడ్డిల భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ 14-21 18-21తో కొరియాకు చెందిన ప్రపంచ ఐదో ర్యాంకర్, మూడో సీడ్ జోడీ సెయుంగ్ జే సియో, యు జంగ్ చేల చేతిలో ఓటమి చెంది మొదటి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు, ఆకర్షి పరస్పరం తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన యు జెన్ చితో తలపడతాడు. రజావత్, శ్రీకాంత్ తైపీకి చెందిన ప్రత్యర్థులు వరుసగా ట్జు వీ వాంగ్ మరియు లి యాంగ్ సులతో తలపడతారు. డెన్మార్క్‌లోని కొపెన్‌హాగన్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు ముందు ఈ టోర్నమెంట్ చివరి ఈవెంట్.