- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది.. ఆసీస్ లెజెండ్ బౌలర్
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్‌పై బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ తరఫున తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టగల సత్తా లియోన్‌కు ఉందన్నాడు. కాగా పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య బుధవారం జనవరి 3 నుంచి ‘పింక్ టెస్టు’ ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించిన గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పింక్ టెస్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీలో తాజాగా జరుగనున్న మ్యాచ్ 16వది.
ఈ టెస్టు సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ విరాళాల సేకరణ చేపట్టనుంది. ఈ సందర్భంగా గ్లెన్ మెగ్రాత్ ప్రసంగిస్తూ.. నాథన్ లియోన్ బౌలింగ్ స్కిల్స్‌ను కొనియాడాడు. ‘‘ప్రతి రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. ఒకవేళ లియోన్ నన్ను దాటేస్తే అంతకంటే సంతోషం ఉండదు. అతడు అసాధారణ బౌలర్. లియోన్‌కు ఆల్ ది బెస్ట్. ఒకవేళ నాతో పాటు షానో(షేన్ వార్న్) రికార్డును కూడా అధిగమిస్తే అతిడికి తిరుగే ఉండదు. లియోన్ బౌలింగ్ నైపుణ్యాలు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం అతడికి అలవాటు’’ అని మెగ్రాత్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా గ్లెన్ మెగ్రాత్ ఘనత సాధించాడు. ఆసీస్ తరఫున 124 టెస్టులు ఆడిన మెగ్రాత్ 563 వికెట్లు తీశాడు. మరోవైపు.. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవలే 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. పాకిస్తాన్‌తో పెర్త్ టెస్టు సందర్భంగా ఈ ఫీట్‌ను చేరుకున్నాడు. అయితే సుమారు మరో నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్న లియోన్ ఇంకో 59 వికెట్లు తీస్తే.. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో మెగ్రాత్‌ను అధిగమిస్తాడు.