- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిస్ ఒలింపిక్స్‌కు సురాజ్ క్వాలిఫై
దిశ, స్పోర్ట్స్ : భారత అథ్లెట్ సురాజ్ పన్వార్ పురుషుల 20 కి.మీ రేస్‌వాక్ ఈవెంట్‌లో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీంతో అక్ష్‌దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్‌జీత్ బిష్త్ తర్వాత 20 కి.మీ రేస్ వాక్‌లో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను సాధించిన నాలుగో భారత అథ్లెట్‌గా సురాజ్ నిలిచాడు. మంగళవారం చండీఘడ్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ రేస్‌వాకింగ్ టోర్నీలో సురాజ్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అక్ష్‌దీప్ 1:19:37.56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని టైటిల్ నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా, తన పేరిట ఉన్న జాతీయ రికార్డును తానే బద్దలుకొట్టాడు. గతేడాది అతను 1:19:55.00 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పగా.. ఈ సారి దాన్ని అధిగమించాడు. సురాజ్ 1:19:43.08 సెకన్లతో రేస్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే.. రేస్‌ను 1:20:10 సెకన్లలో ముగించాల్సి ఉంటుంది. అయితే, దేశం నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు గరిష్టంగా ముగ్గురు రేస్ వాకర్లను మాత్రమే పంపించాల్సి ఉంటుంది. నలుగురు అథ్లెట్లలో ముగ్గురిని ఎంపిక చేయడం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు తలనొప్పిగా మారనుంది. మరోవైపు, మహిళల ఈవెంట్‌లో పంజాబ్‌కు చెందిన మంజు రాణి 1:34:16.67 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. ఉత్తరాఖండ్‌కు చెందిన పాయల్, ఉత్తరప్రదేశ్ అథ్లెట్ మునిత ప్రజాపతి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
Read More..
ఐసీయులో చేరిన భారత స్టార్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. ఇప్పుడెలా ఉందంటే..?
- Tags
- #Athletics