ఛాంపియన్ కళ్లు బైర్లు కమ్మేలా ప్రజ్ఞానందా ఎత్తు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!

by Vinod kumar |
ఛాంపియన్ కళ్లు బైర్లు కమ్మేలా ప్రజ్ఞానందా ఎత్తు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : FTX క్రిప్టో కప్‌ అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. టోర్నీలో చివరిదైన ఏడో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించాడు. అయితే, ఓవరాల్‌గా టాప్‌ స్కోరు సాధించిన కార్ల్‌సన్‌ టోర్నీ విజేతగా నిలవగా.. ప్రజ్ఞానంద రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజ్ఞానంద గెలుపుపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశాడు.

ప్రజ్ఞానందకు సంబందించిన ఫొటోను షేర్ చేస్తూ.. 'ఆ కుర్రాడని చూడండి.. అతని ముఖంలో తీవ్రమైన పట్టుదలను గమనించండి. చదరంగం అనేది సింహాసనాల ఆట అయితే.. త్వరలో సింహాసనాన్ని అధిరోహించే వ్యక్తిగా ప్రజ్ఞానందా కావొచ్చు. మనమందరం అతని పేరును ఎలా సరిగ్గా రాయాలో కూడా నేర్చుకోవాలి.. గుర్తుంచుకోండి' అంటూ ట్వీట్ చేశాడు. ప్రజ్ఞానందా కేవలం ఆరు నెలల్లో మూడోసారి ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు.




Next Story

Most Viewed