క్రికెట్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు.. ఆ నాటి ప్రపంచ ఉత్తమ బౌలర్ అరెస్ట్

by Mahesh |
క్రికెట్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు.. ఆ నాటి ప్రపంచ ఉత్తమ బౌలర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లలో ఫిక్సింగ్ కేసులు కలకలం గా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక టోర్నీలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్లేయర్లు.. క్రీడలకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. అవినీతి కార్యకలాపాల నిరోధక , పోరాట చట్టం, 2004 లోని సెక్షన్ 15 కింద ఐదు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌతాఫ్రికా బౌలర్ సోత్సోబే, త్సోలేకిలే, మ్భలాటిలను అరెస్టు చేశారు. ఇందులో సౌత్ సోబి ప్రపంచ ఉత్తమ బౌలర్ గా నిలిచారు. అయితే ఈ ప్లేయర్లపై ఉన్న ఆరోపణలు 2015-16 రామ్ స్లామ్ ఛాలెంజ్ చుట్టూ ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ సాగా నాటివి. ఈ ముగ్గురు ఆటగాళ్లు 2016, 2017లో దేశవాళీ T20 టోర్నమెంట్‌లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినందుకు క్రికెట్ దక్షిణాఫ్రికా నిషేధించిన ఏడుగురిలో ఉన్నారు. 2021, 2022లో నేరాన్ని అంగీకరించిన తర్వాత జీన్ సైమ్స్, పుమి మత్షిక్వేలకు సస్పెండ్ శిక్ష విధించగా గులాం బోడి ఇప్పటికే జైలు శిక్ష అనుభవించారు. త్సోత్సోబే, త్సోలేకిలే, మభలాటిపై కేసులు ఫిబ్రవరి 2025కి వాయిదా పడ్డాయి. కాగా ఈ ఫిక్సింగ్ కేసులో మొత్తం ఏడుగురు ఆటగాళ్లకు CSA ద్వారా రెండు నుంచి 12 సంవత్సరాల మధ్య నిషేధం విధిస్తారు.

Advertisement

Next Story