- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్‌కు వరుస షాక్‌లు.. మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం సోషల్ మీడియా వేదికగా వీడ్కోలు ప్రకటన చేశాడు. పాక్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మరుసటి రోజే అమీర్ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం సులువుగా తీసుకోలేదని, కానీ యువకులకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు తెలిపాడు. అమీర్ 2020లోనే రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ, ఈ ఏడాది రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న అతను టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొన్నాడు. పాక్ తరపున చివరిసారిగా పొట్టి ప్రపంచకప్‌లోనే ప్రాతినిధ్యం వహించాడు. కాగా, 32 ఏళ్ల అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాటల్లో మొత్తం 271 వికెట్లు తీశాడు. 2017లో పాక్ చాంపియన్స్ ట్రోఫీలో గెలవడంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు.
Advertisement
Next Story