- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అఫ్గాన్ క్రికెటర్‌పై వేటు.. ఐదేళ్లపాటు నిషేధం
దిశ, స్పోర్ట్స్ : అఫ్గనిస్తాన్ క్రికెటర్ ఇహ్సానుల్లా జనత్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ మేరకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) బుధవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అఫ్గాన్ వేదికగా జరిగే కాబుల్ ప్రీమియర్ లీగ్‌లో జనత్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. విచారణలో జనత్ ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లోని ఆర్టికల్ 2.1.1 నిబంధనను ఉల్లంఘించినట్టు తేలింది. ‘అవినీతి కార్యకలాపాలలో తన ప్రమేయం ఉందని జనత్ అంగీకరించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి అతనిపై ఐదేళ్లపాటు బ్యాన్ విధిస్తున్నాం.’ అని ఏసీబీ తెలిపింది. అలాగే, మరో ముగ్గురు ఆటగాళ్లపై కూడా యాంటీ కరెప్షన్ యూనిట్ విచారణ చేస్తుందని పేర్కొంది. కాగా, 26 ఏళ్ల జనత్ 2017లో అఫ్గాన్ తరపున అరంగేట్రం చేశాడు. అఫ్గాన్ తరపున 3 టెస్టులు, 16 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. 2022లో జింబాబ్వేపై చివరి మ్యాచ్ ఆడిన అతను ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు.