డివిలియర్స్‌పై సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్.. ఆర్సీబీని ఉద్దేశించేనా?

by Harish |
డివిలియర్స్‌పై సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్.. ఆర్సీబీని ఉద్దేశించేనా?
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్ కెరీర్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌లో అతను సరైన జట్టుకు ఆడలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంజ్రేకర్‌ను డివిలియర్స్‌ను సూర్యకుమార్ డామినేట్ చేశాడా? అని ప్రశ్నించారు. దానికి మంజ్రేకర్ అవునని సమాధానమిచ్చాడు. సూర్యకుమార్ మ్యాచ్ విన్నింగ్ ఇంపాక్టే అందుకు కారణమని చెప్పాడు. ఈ సందర్భంగా డివిలియర్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఏబీ అద్భుతమైన ప్లేయర్. టెస్టుల్లో, వన్డేల్లో అతని సగటు 50 శాతం. కానీ, ఐపీఎల్‌లో డివిలియర్స్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అతనికి ఎన్నో శక్తిసామర్థ్యాలున్నాయి. ఈ విషయం చెబుతున్నందుకు క్షమించిండి. డివిలియర్స్ తప్పు జట్టుకు ఆడాడు. వేరే జట్టుకు ఆడి ఉంటే డివిలియర్స్ గొప్పతనం మనం చూసేవాళ్లం.’ అని చెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని ఉద్దేశించే మంజ్రేకర్ కామెంట్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డివిలియర్స్ ఐపీఎల్‌లో ఆర్సీబీకి 11ఏళ్ల పాటు ఆడాడు. 2011 నుంచి 2021లో రిటైర్మెంట్ ప్రకటించే వరకు అతను అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 13 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో 184 మ్యాచ్‌ల్లో 5,162 రన్స్ చేశాడు.


Next Story

Most Viewed