ప్రణబ్ మృతి.. క్రీడాకారుల నివాళులు

దిశ, స్పోర్ట్స్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యంతో సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన దేశానికి చేసిన సేవలను పలువురు క్రీడాకారులు గుర్తు చేసుకున్నారు. ‘దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ప్రణబ్ మరణవార్త నన్ను విషాదంలోనికి నెట్టింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరికొంత మంది క్రీడాకారులు కూడా సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.

మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.
– వీవీఎస్ లక్ష్మణ్

ఒక శకం ముగిసింది. ఆయన ఆత్మకు శాంతి
– గుత్తా జ్వాల

ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక, నా ప్రగాఢ సానుభూతులు
– అనిల్ కుంబ్లే

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక
– అజింక్య రహానే

భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఆత్మకు శాంతి
– సైనా నెహ్వాల్

ఆయన మరణవార్తను వినడం నిజంగా విషాదకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి
– క్రిష్ణమాచారి శ్రీకాంత్

ప్రణబ్ ముఖర్జీ మరణవార్త విషాదకరం. నా హృదయపూర్వక నివాళులు
– ఇషాన్ పొరెల్

మన దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన కుటుంబీకులకు నా సానుభూతి.
– రోహిత్ శర్మ

Advertisement