- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రియేటర్లకు స్పాన్సార్ షిప్ ‘రిజిల్ ప్రోగ్రామ్’
దిశ, న్యూస్‌బ్యూరో: టిక్ టాక్‌ను నిషేధించడంతో కోట్లాది మంది భారతీయ క్రియేటర్ల పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో షార్ట్ వీడియోలకు నిలయంగా మార్చేందుకు వీడియో ప్లాట్ ఫామ్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కటి మాత్రం తన నాణ్యత, క్రియేటర్ ఇన్షియేటివ్స్‌తో మిగిలిన వాటి కన్నా భిన్నంగా వ్యవహరిస్తోంది. రిజిల్ అనేది ఓ షార్ట్ వీడియో యాప్. అభిప్రాయాలు, టాక్ షోస్, స్కిట్స్, వ్లోగ్స్, కంటెంట్‌కు సంబంధించిన ఇతర అంశాలకు వేదిక. 2019జూన్ మొదలుకొని రిజిల్ అంతర్జాతీయ స్థాయి వీడియో యాప్‌ను రూపొందించింది. బి- రోల్ వీడియోస్, ఇమేజ్ ఇన్ సర్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, కొల్లాబ్స్‌తో ప్రొఫెషనల్ స్థాయి టాక్ షో కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు రిజల్ ఫీచర్లు తోడ్పడుతాయి.
పాటలు, డ్యాన్స్‌ల పాతదనానికి భిన్నంగా షార్ట్ వీడియోస్ సరికొత్త స్టైల్‌ను ప్రవేశపెట్టింది. ఎంతోమంది క్రియేటర్లు తమ సొంత వ్లోగ్స్, టాక్ షోస్, మినీ – సిరీస్, కుకింగ్ షోస్, రివ్యూ ఛానల్స్, మరెన్నో హోస్ట్ చేసేందుకు స్ఫూర్తినిస్తోంది. క్రియేటర్లకు స్పాన్సర్ షిప్ ఆధారితంగా డబ్బు అందించే ఏకైక వేదికగా మారింది. కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్లు ఈ వేదికపై అభిమానుల నుంచి సులభంగా స్పాన్సర్ షిప్స్ పొందగలుగుతారు. ఎంపికైన క్రియేటర్లు వారు తమ చానల్స్‌ను ప్రారంభించడంలో ఎక్స్‌పర్ట్ క్రియేటర్ అడ్వయిజర్ల నుంచి సాయం పొందొచ్చు. చానల్ థీమ్ సలహాలు, రివ్యూస్, ఫీడ్ బ్యాక్, యాప్ ఫీచర్లపై రెగ్యులర్ వెబినార్స్, ప్రశ్నలు – జవాబులు, హోస్ట్స్ అవకాశాలు, ప్లాట్ ఫామ్ పై తమ చానల్స్ ను ప్రదర్శించడం లాంటి పలు అంశాలపై సలహాలను పొందొచ్చు. మొదటి 1000 మంది అర్హత పొందిన క్రి యేటర్లకు రిజిల్ స్పాన్సర్ షిప్ కూపన్ల ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనుంది. దరఖాస్తు చేసుకోవడానికి [email protected] మెయిల్ చేయండి.