- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రయాణికులకు Spicejet స్వీట్ న్యూస్.. ఈఎమ్ఐలో టికెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రముఖ విమానయాన స్పైస్‌జెట్ సంస్థ తాజాగా విమాన ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. సాధారణంగా విమాన టికెట్ ధరలు సామాన్యూలకు అందనంత దూరంలో ఉంటాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని స్పైస్‌జెట్ సంస్థ సామాన్యూలను కూడా విమాన ప్రయాణాలు చేసేందుకు ప్రోత్సహించేలా టికెట్ ధరలకు నెలవారీ వాయిదా(ఈఎమ్ఐ) సౌకర్యాన్ని ప్రారంభించింది. టికెట్ ధరలను సులభ వాయిదా పద్దతిలో చెల్లించేందుకు అనుమతిస్తూ, వడ్డీ లేకుండా 3-12 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించే విధానం తీసుకొచ్చినట్టు స్పైస్‌జెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఆఫర్‌ను కావాలనుకునే వినియోగదారులు పాన్ కార్డు, ఆధార్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఎంపిక చేసిన తర్వాత మొదటి ఈఎమ్ఐని యూపీఐ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన ఈఎమ్ఐలు ఆటోమెటిక్‌గా చెల్లించబడతాయి. దీనికోసం డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు ఇవ్వాల్సిన పనిలేదని కంపెనీ వివరించింది.