క్షీణించిన స్పెన్సర్స్ ఆదాయం

by  |
క్షీణించిన స్పెన్సర్స్ ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రిటైల్ సంస్థ స్పెన్సర్స్ (Spencers) రిటైల్ లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 27 శాతం క్షీణించి రూ. 439 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించింది. అలాగే, ఈ త్రైమాసికంలో సంస్థ రూ. 47 కోట్ల నికర నష్టాలను నమోదు చేసిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. కోటి నికర లాభాలను నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌ (Regulatory Filing)లో పేర్కొంది. లాక్‌డౌన్, పరిమిత గంటలు కార్యకలాపాల కారణంగా దుస్తులు, సాధారణ వస్తువులు, ఇతర ఆహరేతర వస్తువుల అమ్మకాలపై తీవ్ర ప్రభావం ఏర్పడినట్టు తెలిపింది.

సమీక్షించిన త్రైమాసికంలో ఈ-కామర్స్ విభాగం (E-Commerce Department) ఐదు రెట్లు పెరిగిందని, దీంతో సాధారణ వ్యాపార నష్టాలను పాక్షికంగా భర్తీ చేసినట్టు స్పెన్సర్స్ (Spencers) వెల్లడించింది. సంక్షోభ సమయాన్ని ఒక అవకాశంగా భావించాము. స్టోర్లలోనే కాకుండా ఈ-కామర్స్ విభాగం వంటి ప్రయత్నాలతో వినియోగదారులను కాపాడుకున్నము. హైపర్ లోకల్ కస్టమర్ కనెక్ట్స్, ఫోన్ డెలివరీ, ఆర్డర్ టేకింగ్ చాట్‌బాట్స్, అలాగే స్పీడ్ డెలివరీ వంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు చేరువగా ఉన్నామని స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్ సెక్టార్ హెడ్ శశాంక్ గొయెంకా తెలిపారు. ఈ కర్యక్రమాలను భవిష్యత్తులో కొనసాగిస్తామని, తద్వారా వృద్ధిని సాధించేందుకు ఇవి ఉపయోగపడతాయని శశాంక్ వెల్లడించారు.


Next Story