ధరణి ప్రక్రియను వేగవంతం చేయండి

by Shyam |
ధరణి ప్రక్రియను వేగవంతం చేయండి
X

దిశ, పటాన్‌చెరు:
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి నిర్మాణలను సిబ్బంది నమోదు చేస్తున్న ప్రక్రియ తీరును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ధరణి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పరిధిలోని ప్రతి నిర్మాణాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. యజమాని పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, నిర్మాణం స్వభావం, విస్తీర్ణం కొలతలు తీసుకోని నమోదు చేయాలని సూచించారు. అన్ని రకాల నిర్మాణలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులకు తెలిపారు.

Advertisement

Next Story