- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండింగ్ డెవలప్‌మెంట్ వర్క్స్ వేగవంతం చేయాలి
దిశ, వరంగల్: వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వివిధ పథకాల కింద చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహా నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి నగరంలో సీఎం అస్యూరెన్స్ పథకం కింద 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాల్లో మంజూరైన అభివృద్ధి పనులు, స్మార్ట్ సిటీ పనులు, రెండు పడక గదుల నిర్మాణాల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ పనులను గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఆయా పథకాల కింద మంజూరైన నిధులు, వాటి ఖర్చు, పనుల స్థితి, పెండింగ్ బిల్లులు, ఇంకా కావలసిన నిధులపై వెంటనే సవివరమైన నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పట్టణంలో ప్రజల మౌలిక వసతుల కోసం చేపట్టిన పనుల్లో అలసత్వం వహించకుండా వేగవంతం చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..జీడబ్ల్యూఎంసీ, కుడా పరిధిలో సీఎం హామీ పథకం కింద 2016-17 ఏడాదిలో రూ.300 కోట్లతో 812 అభివృద్ధి పనులు అయినా రింగ్ రోడ్డు, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీరు పంపింగ్, పలు అంతర్గత నిర్మాణాలు, డివిజన్లలో పార్కులు, డ్రైనేజీలు, అంతర్గత సీసీ, బీటి రోడ్లు, వైకుంఠ దామాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం మొదలగు వాటిని సమీక్షించి ప్రారంభం కాని పనులను వెంటనే చేపట్టాలన్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మడికొండ, భట్టుపల్లిలలో చేపడుతున్న రెండు పడక గదుల పనులపై జాప్యం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్మార్ట్ సిటీ పనులపై సమీక్షిస్తూ రూ.65 కోట్ల వ్యయంతో భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు, రూ.65కోట్ల వ్యయంతో నగరంలోని అంతర్గత 11 రకాల స్మార్ట్ రోడ్ల పనులు, స్మార్ట్ రోడ్ల ప్యాకేజీ 4లో భాగంగా రూ.65 కోట్ల వ్యయంతో చేపడుతున్న నగరంలోని నాలుగురోడ్ల పనులను త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 నగర ఆహ్వాన ముఖ ద్వారాల్లో 3 ద్వారాల పనులు పురోగతి దశలలో ఉన్నాయని, మిగిలిన ఒక ద్వారం టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.