వరంగల్ సీపీ ఆఫీసులో ప్రత్యేక టాస్క్ ఫోర్స్..

by Shyam |

దిశ, వరంగల్: తెలంగాణలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ రవీందర్ గురువారం ప్రకటించారు. వరంగల్ ఓఎస్డీ తిరుపతి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లుగా పనిచేస్తున్న నందిరాం నాయక్, మధులతో పాటు సిబ్బంది పనిచేస్తారన్నారు. ఈ విభాగం నిత్యావసరాలైన పప్పులు, బియ్యం, పాలు , బెడ్, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలతో పాటు ఔషధ, వైద్య పరికరాలు, విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ లాంటి వస్తువుల రవాణాకు చెక్ పోస్టుల వద్ద ఎలాంటి అటంకం రాకుండా సరైన సమయంలో ప్రజలకు అందించేందుకు పనిచేస్తాయన్నారు. అలాగే సీపీ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమించినట్టు వివరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యావసర వస్తువుల రవాణా, ధర నియంత్రణలో ఆ అధికారి పర్యవేక్షించడంతో పాటు, సమస్యలు ఉత్పన్నమయినప్పుడు వీరు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో ముఖ్య భూమిక పోషిస్తారన్నారు. అదే సమయంలో ఎవరైన నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

tags : warangal , special task force, corona, lockdown, cp ravinder

Advertisement

Next Story

Most Viewed